భారతదేశం, నవంబర్ 7 -- తెలంగాణలో గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు పన్నులు, ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలతో సంబంధం లేకుండా నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త ఆదేశాలు జారీయ్యాయి.

ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్‌ (నాలుగో సవరణ) చట్టం-2026కు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో నంబరు 43ను విడుదల చేశారు. ఈ చట్ట సవరణ 2026 అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా మిగిలిపోకూడదని, గ్రామ స్థాయిలోనే స్వీయ పరిపాలన సాగించే అధికారిక సంస్థలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ...