గోపాల్పూర్ వద్ద నేడు తీరం దాటనున్న 'అక్వాన్' తుపాను.. ఉత్తరాంధ్రలో అలజడి
భారతదేశం, నవంబర్ 20 -- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను 'అక్వాన్' తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. నవంబర్ 20, శుక్రవారం నాడు ఒడిశాలోని పూరీకి సమీపంలో ఉన్న గోపాల్పూర్ వద్ద ఈ తుపాను తీరం దాటనుంది. రాబోయే రెండు గంటల్లోనే తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను బాహ్య మేఘాల వలయాలు ఇప్పటికే భూభాగంలోకి ప్రవేశించడంతో తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
సాధారణంగా నవంబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. తాజాగా 'అక్వాన్' తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉండటంతో తీర ప్రాంత యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటను పూర్తిగా నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట తీర ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.