గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి - 6 జిల్లాలకు హెచ్చరికలు జారీ..!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీటి మట్టం గంటగంటకూ వేగంగా పెరుగుతుండటంతో తీర ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే, ఈరోజు రాత్రి నాటికి బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి ప్రవాహం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తక్షణ చర్యలు చేపట్టింది. పరిస్థితిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. గోదావరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.