గోదావరికి వరద.. పోలవరం నుంచి నీటి విడుదల, లంక గ్రామాలకు హెచ్చరికలు
భారతదేశం, జూలై 27 -- గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఇందులో భాగంగా పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం ఉదయానికే వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. ఆలయ పరిసరాలతో పాటు అమ్మవారి అంతరాలయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అధికారులు, అర్చకులు అప్రమత్తమయ్యారు.
గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయంలోని అమ్మవారి విగ్రహం వరకు వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణం, ముఖ్య మండపం, భక్తులు వెళ్లే క్యూలైన్లు అన్నీ నీటమునిగాయి. ఈ పరిణామంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అమ్మవారి దర్శనాలను తక్షణమే నిలిపివేశారు.
గోదావరిలో వరద ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.