గెట్ టు గెదర్ పార్టీలో ఘోరం.. స్విమ్మింగ్ పూల్‌లో టెక్కీ మృతదేహం.. అర్ధరాత్రి ఏం జరిగింది?
భారతదేశం, జూన్ 15 -- యాదాద్రి భువనగిరి జిల్లాలో కొయ్యలగూడెం శివారులో ఒక ఫామ్‌హౌస్‌లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాముగా పోలీసులు గుర్తించారు. రాము హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం వీకెండ్ కావడంతో తన టీమ్ లీడర్‌తో పాటు మరో 15 మంది సహోద్యోగులతో కలిసి పార్టీ చేసుకునేందుకు యాదాద్రి జిల్లాలోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది.
అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రాము ఫామ్‌హౌస్ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సహోద్యోగులు గమనించారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాము మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సమాచార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.