గృహిణులు దేశ నిర్మాతలు: పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారతదేశం, జూన్ 11 -- ఇంట్లో గృహిణి (హోమ్‌మేకర్) రోజంతా చేసే పనులకు ఎనలేని విలువ ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహిణులు కేవలం కుటుంబాలనే కాదు, దేశాన్ని నిర్మిస్తారని కొనియాడింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక మహిళకు సంబంధించిన పరిహారం కేసును విచారిస్తూ, గృహిణి అందించే గృహ సంరక్షణ సేవలను నెలకు కనీసం రూ. 30,000 ఆదాయంగా లెక్కించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యం పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. 2001 నవంబర్ 25న జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె భర్త, ముగ్గురు పిల్లలు పరిహారం కోసం 'మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్'ను ఆశ్రయించారు. అప్పట్లో ఆ ట్రిబ్యునల్ వారికి రూ. 2.42 లక్షల పరిహారాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.