భారతదేశం, మార్చి 26 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. తన ఏఐ చాట్‌బాట్ 'జెమిని'లో సరికొత్త 'లిరియా 3 ప్రో' (Lyria 3 Pro) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల సంగీత ప్రియులకు, క్రియేటర్లకు అద్భుతమైన అవకాశం లభించనుంది. ఇప్పటివరకు జెమినిలో కేవలం 30 సెకన్ల నిడివి గల ఆడియో క్లిప్పులను మాత్రమే రూపొందించే వీలుండేది, కానీ తాజా అప్‌డేట్‌తో ఏకంగా 3 నిమిషాల నిడివి గల పూర్తిస్థాయి మ్యూజిక్ ట్రాక్స్‌ను తయారు చేసుకోవచ్చు.

కేవలం నిడివి పెరగడమే కాదు, సంగీత నాణ్యత (High-fidelity) విషయంలోనూ గూగుల్ భారీ మార్పులు చేసింది. లిరియా 3 ప్రో ద్వారా రూపొందించే పాటల్లో పల్లవి (Verse), చరణం (Chorus), మ్యూజిక్ బిట్స్ (Bridges) వంటి వాటిని మనకు నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు. అంటే, మ్యూజిక్ కంపోజిషన్ మీద యూజర్లకు పూర్తి న...