భారతదేశం, ఆగస్టు 18 -- రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. వర్షా కాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలిచ్చారు.

నాణ్యమైన విద్యను అందిస్తున్న బీసీ గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు మంత్రి సవిత. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ బీసీ గురుకులాల భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. ఆరు బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. బీసీ బాలికల డ్రాపౌట్ల నివారణ...