భారతదేశం, నవంబర్ 11 -- పల్నాడు జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రంతా చదువుకుని ప్రశాంతంగా నిద్రపోయిన విద్యార్థినులు ఉదయాన్నే నిద్రలేచి చూసుకునేసరికి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి జుట్టు రాత్రికి రాత్రే కత్తిరించి నేలపై పడి ఉండటంతో ఆ బాలికలు తెల్లారి చూసుకోగానే.. భయంతో కేకలు వేశారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల వసతి గృహంలో ఈ ఘోరం వెలుగుచూసింది.

రామకృష్ణాపూర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 10 మంది విద్యార్థినులు రోజులాగే రాత్రి భోజనం ముగించుకుని తమ గదుల్లో నిద్రపోయారు. అయితే ఉదయం నిద్రలేచేసరికి తమ జడలు కత్తిరించి ఉండటం చూసి ఆ పిల్లలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? అనేది తెలియక భయంతో వణికిపోయారు. సమాచా...