భారతదేశం, జూన్ 30 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా రైల్వే బోర్డు వల్సాడ్- వేళాంకణి స్పెషల్ ట్రైన్ నెం.09030, ట్రైన్ నెం.09029 వేళాంకణి - దహను రోడ్ నడపడానికి ఆమోదం తెలిపింది.

09030 వల్సాడ్-వేళాంకణి మధ్య 3 జులై 2026 మధ్య వల్సాడ్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. 10 గంటలు ప్రయాణించి మరుసటి రోజు వేళాంకణి చేరుకుంటుంది.

ట్రైన్ నెంబర్ 09029 వేళాంకణి-దహను రోడ్ 6 జులై 2026 మధ్య నడుస్తుంది. వేళాంకణిలో అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి.. 10.30 గంటలు జర్నీ చేస్తుంది. మరుసటి రోజు దహను రోడ్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు దహను రోడ్, పాల్ఘర్, వసాయి రోడ్, పన్వెల్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్...