భారతదేశం, జూన్ 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో వెయిటర్ ఫుడ్ కింద పడేస్తే నీతూ తిడుతుంది. ఇంకో ఆర్డర్ ప్రిపేర్ చేస్తానని రవి అంటాడు. కిచెన్‌లోకి వెళ్లిన నీతూ జారడంతో కిందపడిపోతుంది. కాలు బెణుకుతుంది.

నొప్పితో అరుస్తుంది నీతు. అది విన్న రవి వచ్చి చూసి షాక్ అవుతాడు. నీతూను ఎంత పైకి లేపేందుకు ట్రై చేసిన లేవలేకపోతుంది. దాంతో నీతూని ఎత్తుకుని రవి బయటకు తీసుకొస్తాడు. అప్పుడే రెస్టారెంట్‌కు వచ్చిన శ్రుతి నీతూని రవి ఎత్తుకోవడం చూసి ఛీ కొట్టి వెళ్లిపోతుంది. సోఫాలో నీతూని కూర్చోబెట్టి శ్రుతి దగ్గరికి రవి వెళ్లి ఆపుతాడు.

కానీ, శ్రుతి ఏది వినకుండా ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. నీతూ దగ్గరికి రవి వెళ్తాడు. శ్రుతి కోపంగా వెళ్లిపోయిందని రవి చెబుతాడు. నీతూ కాల్ చేయమని చెబుతుంద...