భారతదేశం, జూన్ 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి ఫేక్ డ్రామా బయటపడటంతో బాలు గుణపాఠం కచ్చితంగా చెబుతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. డాబా పైకి మీనాను తీసుకెళ్తాడు బాలు.

నీ గురించి ఎవరైనా ఏమైనా అంటే పోనిలే అని ఊరుకుంటావ్. అదే నువ్వు చేసే తప్పు. ఇకనుంచి నువ్వు ఇంట్లో వంట చేయకు. అప్పుడే నీ విలువ తెలుస్తుంది అని బాలు అంటాడు. వాళ్లు అలా చేశారని మనం కూడా అలాగే చేస్తే నాకు వాళ్లకు తేడా ఏంటీ అని మీనా అంటుంది. ఇంట్లో పనులు అలాగే ఉన్నాయని, వెళ్లాలని మీనా అంటుంది.

నేను చెబుతున్నాగా. భర్త మాట వినాలి కదా. నువ్వు సమ్మే చేయాల్సిందే అని బాలు అంటే.. సరేనని మీనా అంటుంది. తర్వాత మీనా చేసినదానికి చాలా గర్వంగా ఉందని, ఎంతమంది ఉన్నా నాయకత్వం ఉండాలని బాలు పొగుడుతాడు. వచ్చిన లాభం డబ్బు...