భారతదేశం, మే 26 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మలేషియా నుంచి వచ్చిన దంపతుల కోసం మీనా వంట చేస్తుంటుంది. ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. శ్రుతి సెటైర్లు వేస్తుంది. మీనా ఒక్కత్తే ఇన్ని కూరగాయలు కట్ చేస్తుంటే కామాక్షి ఆంటీ ఇంటికి పప్పు డబ్బాలో డబ్బులు దాచుకోడానికి వెళ్లారా అని అడుగుతుంది శ్రుతి.

దాచుకోడానికి మీ ఆయన తెచ్చి లక్షలు లక్షలు ఏం పోయట్లేదని ప్రభావతి అంటుంది. లక్షలు సంపాదించిన ఈ ఇంటికి తీసుకురాడు. ఇక్కడ దాచేవాళ్లకంటే మింగేవాళ్లు ఎక్కువ కదా అని పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తుంది శ్రుతి. దాంతో శ్రుతిని స్టౌవ్ ఆఫ్ చేసి రమ్మని డైవర్ట్ చేస్తుంది మీనా. శ్రుతి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి అక్కడ మంట ఆర్పాను, ఇక్కడ మొదలైనట్లుందని అంటుంది. శ్రుతి అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి....