భారతదేశం, జూన్ 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాతో చేయి నొప్పి అని ఫేక్ డ్రామా ఆడిన ప్రభావతి తను వండిన కూరలు వద్దని, క్యారెట్ ఫ్రై, టొమాటో రైస్ చేయమంటుంది. ఆదరబాదరగా కాకుండా నిదానంగా చేయమని చెబుతుంది అత్త ప్రభావతి.

సరేనని మీనా వెళ్లిపోతుంది. పిచ్చిది.. నా మాటలకు దడుసుకుని ఉండుంటుంది. ఇక ఆ కాంట్రాక్ట్ పోయినట్లే అని సంతోషపడుతుంది ప్రభావతి. వీడియో కాల్‌లో డెకరేషన్ చూసి బాగుందని, ఏది ఎలా చేయాలో చెబుతుంది మీనా. వీడియో కాల్‌లో డెకరేషన్ ఎలా చేయాలో చెప్పిన మీనా క్యారెట్ కట్ చేస్తూ వంట చేస్తుంది.

మొత్తం మండపం డెకరేషన్‌ను బాలు చూపిస్తాడు. శభాష్ మీనా నువ్వు సాధారణమైనదానివి కాదు. మేనేజర్ కూడా షాక్ అయ్యారు అని బాలు అంటాడు. మీరు ఉన్నారు, సుమతి చూసుకుంది. మీరంతా ఉన్నారు. మీరందరు ఉ...