భారతదేశం, జూన్ 2 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అత్తింట్లో శ్రుతి గంటల పంచాయతీ పెడుతుంది. నిద్ర పోయే టైమ్ కాకుండా మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు అని శ్రుతి అడుగుతుంది. దాంతో 9 గంటలు అని మనోజ్, రోహిణి చెబుతారు.

మీనా, బాలును అడిగితే.. పది గంటలు అని చెబుతుంది. దాంతో వినపడిందా, వాళ్లు దాదాపుగా రోజు మొత్తంగా కలిసి ఉంటున్నారని శ్రుతి గొడవ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది రవి అని మీనా అడిగితే.. తను డబ్బింగ్ చెప్పిన సీరియల్ ప్రభావం, అందులో ఒకావిడ సరిగా కలిసి ఉండట్లేదని విడాకులు తీసుకుందట. మనం కూడా అలా అవుతావేమో అని నా మీద పడింది బ్రహ్మ రాక్షసి అని రవి అంటాడు.

మసులో ప్రేమ ఉంటే ఎంతసేపు కలిసి ఉన్నా ఏం కాదని మీనా అంటుంది. అది ఈ నైటీలోడికి లేదని, మాట్లాడితే నీ తూ.. అంట...