గల్ఫ్‌లో ముదురుతున్న ఉద్రిక్తతలు: భారతీయుల నౌక 'జలవీర్'పై అమెరికా దాడి
భారతదేశం, జూన్ 11 -- ఓమన్ సమీపంలోని షినాస్ రేవు వద్ద భారత సిబ్బందితో ప్రయాణిస్తున్న 'జలవీర్' అనే నౌకపై అమెరికా దళాలు దాడి జరిపాయి. గినియా-బిస్సావు జెండాతో వెళ్తున్న ఈ ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడితో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నౌకలోని భారత సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనపై ఓమన్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తూ, మరిన్ని వివరాల కోసం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.
ఈ వారంలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దళాలు దాడులు చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గల్ఫ్ జలాల్లో ఇరాన్ అనుకూల నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరుపుతున్న దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ జలాలు అగ్నిగుండం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.