గణేష్ చతుర్థి వేడుకలకు దూరంగా ఓ గ్రామం.. కారణం ఏంటో తెలుసా?
భారతదేశం, సెప్టెంబర్ 14 -- దేశమంతటా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పటికీ, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం ఈ ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బసంపల్లి మండలం శెట్టూరు గ్రామ ప్రజలు వినాయక చవితి వేడుకలను నిర్వహించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
శెట్టూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన మారెమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయి. గణేష్ చతుర్థి సోమవారం. సాధారణంగా ఈ గ్రామ దేవత జాతర వినాయక చవితి పండుగకు ఒకటి లేదా రెండు రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఈ సంవత్సరం మారెమ్మ ఉత్సవాలు.. గణేష్ చతుర్థి తర్వాతి రోజున ఉన్నాయి.
గ్రామ ఆచారం ప్రకారం మారెమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గ్రామస్థులు, భక్తులు సాంప్రదాయబద్ధంగా మాంసాహార నైవేద్యాలను సమర్పిస్తారు. ఒకవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.