ఖైరతాబాద్ బడా గణేష్ 2026 : ఈ సారి పంచముఖ సంకటహార మహా గణపతిగా దర్శనం - వైభవంగా కర్ర పూజ
భారతదేశం, జూన్ 26 -- భాగ్యనగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది 'పంచముఖ సంకటహర మహాగణపతి' రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ మండపం వద్ద విగ్రహ తయారీకి సంబంధించిన తొలి పూజ (కర్రపూజ)ను ఉత్సవ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమంతో భాగ్యనగరంలో వినాయక చవితి శోభ ముందే వచ్చేసింది.
ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల కోసం 69 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో బడా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఐదు తలలు, ఎనిమిది చేతులతో విరాజిల్లే ఈ విశిష్ట నమూనాను ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విడుదల చేశారు.
ఈ మహా గణపతికి కుడి వైపున సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళీమాత విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.