భారతదేశం, సెప్టెంబర్ 5 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే పండుగ సీజన్‌లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఒక సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో అలరిస్తున్న హ్యుందాయ్ 'బేయాన్' (Bayon) మోడల్ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. పొడవు నాలుగు మీటర్ల కంటే ఎక్కువగా ఉండే ఈ మోడల్.. హ్యుందాయ్ క్రెటా (Creta) కింది శ్రేణిలోకి వస్తుంది. ఇటీవల లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం ఈ కొత్త ఎస్‌యూవీ విశేషాలు వాహనప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సాధారణ ఎస్‌యూవీల మాదిరిగా బాక్సీ ఆకారంలో కాకుండా, ఈ కొత్త కారు క్రాసోవర్ శైలిలో కంటికి ఇంపుగా కనిపించనుంది. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌లాంప్‌లతో పాటు వాహనం వెడల్పు అంతా పరిచేలా ఉం...