క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.. జులై 21 నుంచి దరఖాస్తులు!
భారతదేశం, జూలై 20 -- హైదరాబాద్ మహానగర పరిధిలో నివసించే అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE - క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌తో కలిసి సచివాలయంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పథకం విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియతో కూడిన బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు.
జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాలలో సొంత ఇల్లు, స్థలం లేని పేదల కోసం ప్రభుత్వం మొత్తం లక్ష ఫ్లాట్లను నిర్మించనుంది. మొదటి విడత కింద క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 500 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభించనున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.