క్యాన్సర్ పేషెంట్లకు ఉపశమనం: 543 ఔషధాల ధరలు భారీగా తగ్గింపు
భారతదేశం, నవంబర్ 2 -- క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వేలాది మంది బాధితులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఉపశమనం అందించింది. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో వాడే 543 రకాల కీలక ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలపై (ఎమ్ఆర్పీ) భారీ కోతలు విధిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. సవరించిన నూతన రేట్లు నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి.
ఔషధ తయారీ కంపెనీలు అక్టోబర్ 27 నాటికి అందజేసిన వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. మిగిలిన కంపెనీలు తమ సవరించిన ధరల జాబితాను సమర్పించే కొద్దీ ఈ జాబితాను నిరంతరం నవీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
దేశీయంగా క్యాన్సర్ మందుల మార్కెట్లో దాదాపు 225 మందులు, 500 రకాల ఫార్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.