భారతదేశం, నవంబర్ 9 -- మన వంటింట్లో నూనె కేవలం ఒక రుచి కారకం మాత్రమే కాదు.. మన శరీర ఆరోగ్యానికి పునాది లాంటిది. ఆరోగ్యంపై కాస్త ధ్యాస ఉన్నవారికైనా, లేనివారికైనా తాము ఎలాంటి నూనె వాడుతున్నామనే అవగాహన ఉండటం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే మనం తీసుకునే నూనే మన సమగ్ర ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్న వేళ.. కోల్డ్ ప్రెస్డ్ (మన భాషలో చెప్పాలంటే సాంప్రదాయ గానుగ నూనెలు), రిఫైన్డ్ నూనెల మధ్య అసలు తేడాలేంటి? ఏది దేనికి ఉపయోగపడుతుంది? అనే అంశాలపై 'ప్యూర్ సిఫ్ట్' వ్యవస్థాపకురాలు మానస జి ఆరాధ్య కీలక విషయాలను పంచుకున్నారు.

గానుగ నూనెలకు, రిఫైన్డ్ నూనెలకు మధ్య ఉన్న ప్రధాన తేడా వాటిని గింజల నుంచి సేకరించే విధానంలోనే ఉందంటున్నారు మానస. ఈ తయారీ పద్ధతులే ఆయా నూనెల రుచి, వాసన, పోషకాల సాంద్రత, వంటల్లో వాటి వినియోగ...