భారతదేశం, ఆగస్టు 25 -- రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర క్రూరత్వంలో కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి, ప్రాణాలతో బయటపడిన 10 ఏళ్ల చిన్నారి రియాన్ష్ కార్తికేయరెడ్డి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ చేసిన అకృత్యాల వల్ల తాను నిమిషాల వ్యవధిలో అనాథగా మిగిలిపోయానని ఆ బాలుడు కన్నీరుమున్నీరయ్యాడు.

భయాందోళనలో ఉన్న చిన్నారి రియాన్ష్‌ను కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలుడితో పాటు ఎంపీ మీడియాకు ఈ దారుణమైన పరిస్థితులను వివరించారు.

మీడియాతో బాలుడు రియాన్ష్ మాట్లాడుతూ 'నాకు 3వ తరగతి నుంచే రైఫిల్ షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో శిక్షణ తీసుకునే స...