కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం: 15 మంది మృతి, భవనంపై నుంచి దూకిన విద్యార్థులు
భారతదేశం, జూన్ 22 -- ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గుండెలవిసే విషాదం జరిగింది. అలీగంజ్ పరిధిలోని పురానియా (సెక్టర్ డి) ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ భవనంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో భవనంలో భారీగా మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు పై అంతస్తుల నుంచి కిందకు దూకడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఎనిమిది ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 12 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అయితే భవనం లోపల ఇంకా పలువురు విద్యార్థులు చిక్కుకుపోయినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.