భారతదేశం, సెప్టెంబర్ 11 -- విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రమాదం కారణంగా ఇవాళ నడిచే పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్ల బయలుదేరే సమయాలను సవరించినట్లు (రీషెడ్యూల్) దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. పట్టాలపై పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నందున.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బొగీలను తొలగించి, ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది ఘటనా స్థలంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైళ్ల సమయాల్లో మార్పులు జరిగినందున ప్రయాణికులు గమనించి. తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో నాలుగో లైన్‌పై గూడ్స్‌ రైలు ...