భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన నూతన పార్టీ జెండా, అజెండాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల క్షేమమే ధ్యేయంగా ఈ కొత్త ప్రత్యామ్నాయ శక్తులు రూపుదిద్దుకుంటున్నాయని వెల్లడించారు.

రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ చుట్టూనే రాజకీయం తిరుగుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశాయని విమర్శించారు. ఒక వైపు రెడ్ బుక్ పాలన సాగిస్తున్న టీడీపీ, మరోవైపు రప్పా రప్పా సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వైసీపీల మధ్య యుద్ధం జరుగుతోందని దుయ్యబ...