భారతదేశం, జనవరి 2 -- కొత్త ఏడాది మొదటి రోజు.. ఏదో సాధించాలనే కసి, విపరీతమైన ఉత్సాహం! ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాం. కానీ, తీరా మొదటి వారం గడిచేసరికి ఆ జోష్ కాస్తా నీరుగారిపోతుంది. అనుకున్నవి చేయలేకపోతున్నామే అన్న గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది. అసలు ఈ 'రెజల్యూషన్స్' మనల్ని ఉత్సాహపరచాల్సింది పోయి, ఎందుకు ఒత్తిడికి గురిచేస్తున్నాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో తెలిస్తే.. మీరు మీపై మీరు కోప్పడటం మానేసి, కొత్త కోణంలో ఆలోచించడం మొదలుపెడతారు.

ఈ అంశంపై 'గేట్‌వే ఆఫ్ హీలింగ్' వ్యవస్థాపకురాలు, ప్రముఖ సైకోథెరపిస్ట్ డాక్టర్ చాందినీ తుగ్నైత్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా జనవరి 1 రాగానే సోషల్ మీడియాలో 'న్యూ ఇయర్ - న్యూ మీ' (కొత్త ఏడాది - కొత్త నేను) అనే నినాదాలు హోరెత్తుతుంటాయి. వి...