కొత్తూరు తాడేపల్లి శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
భారతదేశం, అక్టోబర్ 7 -- ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని ప్రముఖ శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనున్నట్లు ఆలయ భక్తమండలి సభ్యులు ప్రకటనలో వెల్లడించారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం నుంచి విజయదశమి రోజు వరకు పది రోజుల పాటు అమ్మవారికి విభిన్న రూపాల్లో విశేష పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో వివిధ రకాల ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఉదయం 08:00 గంటలకు శ్రీ దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.