భారతదేశం, ఫిబ్రవరి 17 -- సినీ హీరో అర్జున్ సర్జా తన కుటుంబంతో కలిసి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. సోమవారం కొండగట్టు దేవాలయానికి చేరుకున్న అర్జున్,,, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు అర్జున్ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తాను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. స్వామివారి శేషవస్త్రంతో అర్జున్‌ను సత్కరించి ప్రసాదం అందజేశారు.

దర్శనం తర్వాత హీరో అర్జున్‌ మాట్లాడుతూ... ఏ ప్రాంతంలోనైనా ఆంజనేయ స్వామి దర్శనం తనకు ఎంతో విశేషమన్నారు. "కొండగట్టు టెంపుల్ గురించి ఎంతో విన్నాను. ఎంతో శక్తిమంతుడని తెలుసుకున్నాను. మొదటిసారిగా ఈ కొండగట్టుకు వచ్చాను. ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నను దర్శ...