భారతదేశం, మే 4 -- కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత దశాబ్ద కాలంగా ఎర్రకోటగా ఉన్న కేరళలో ఇప్పుడు 'హస్తం' గర్జన వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ఏకంగా 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు, చరిత్ర సృష్టించాలనుకున్న పినరయి విజయన్ సర్కార్ అనూహ్యంగా వెనుకబడిపోయింది.
ఉత్తర పరవూర్ నియోజకవర్గంలో వి.డి. సతీశన్ తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ప్రస్తుతానికి సతీశన్ 11,376 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఈ విజయం ఆయనను ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందు వరుసలో నిలబెట్టింది.
కాగా, ఈ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన కంచుకోట ధర్మడమ్‌లో వెనుకంజలో ఉండటం గమనార్హం. వీణా జార్జ్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.