కేబీఆర్ పార్క్ పరిధిలోని చెట్లను నరికివేయకూడదు : సుప్రీం కోర్టు
భారతదేశం, మే 18 -- హైదరాబాద్ నగర నడిబొడ్డున కేబీఆర్ జాతీయ పార్కు పర్యావరణ పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు తిరిగింది. ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను కొట్టేయడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ ఒక్క చెట్టును కూడా కొట్టేయకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
పార్కు పరిధిలోని 'పర్యావరణ సున్నిత ప్రాంతం' (Eco-Sensitive Zone)లో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను నరకడానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1,300 చెట్లను నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
'రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను తొలగిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకుండా పర్యావరణానికి త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.