భారతదేశం, అక్టోబర్ 5 -- హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. కేబీఆర్ జాతీయ పార్కు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ క్షేత్రస్థాయిలో కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఉన్న ప్రధాన మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, నగరవాసులకు మేలు చేసే పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.

గతంలో కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిపాదించిన హెచ్-సిటీ పనులను జీహెచ్‌ఎంసీ అధికారికంగా రద్దు చేసింది. పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల రక్షణ, అనవసర వ్యయాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ...