భారతదేశం, సెప్టెంబర్ 26 -- వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును రహస్యమైన, నీడ గ్రహంగా పరిగణిస్తారు. గ్రహాల సంచారం మానవ జీవితంపై, రాశిచక్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం కేతువు సింహరాశిలో కొలువై ఉన్నాడు. దీనితో పాటు కేతువు తన సొంత నక్షత్రమైన 'మఖ' నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు ఈ మఖ నక్షత్రంలోని వివిధ పాదాలలో ప్రయాణించనున్నాడు.

సొంత నక్షత్రంలో కేతువు సంచరించే ఈ కాలంలో మొత్తం 5 రాశుల వారికి అద్భుతమైన సానుకూల ఫలితాలు దక్కనున్నాయి. వ్యాపారంలో ఊహించని పురోగతి, ఉద్యోగాల్లో పదోన్నతులు, కోర్టు కేసుల్లో విజయం వంటి విశేష ప్రయోజనాలు ఈ రాశుల వారి సొంతం కానున్నాయి. డిసెంబర్ వరకు కేతువు అనుగ్రహంతో ఏ ఏ రాశుల జాతకం మారనుందో వివరంగా తెలుసుకుందాం....