కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. బీఆర్ఎస్లోకి రీ ఎంట్రీ ఇస్తారా?
భారతదేశం, అక్టోబర్ 29 -- తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత, నిరాధార వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెబుతూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే విమర్శలు చేశానని, కేటీఆర్‌ను గానీ ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేస్తూ ఆమె చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
'బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.