కేఎఫ్సీలో కుళ్ళిన చికెన్.. మంగళూరు ఔట్‌లెట్‌ను సీజ్ చేసిన అధికారులు
భారతదేశం, ఆగస్టు 17 -- మంగళూరులోని కె.ఎస్. రావు రోడ్డులో ఉన్న సిటీ సెంటర్ మాల్లోని కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌ను ఆహార భద్రతా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చికెన్ దుర్వాసన వస్తూ, కుళ్ళిపోయి ఉందంటూ ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించారు. ఔట్‌లెట్‌పై మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో అధికారులు కేఎఫ్‌సీ కిచెన్, స్టోర్‌రూమ్‌తో పాటు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను అంగుళం అంగుళం పరిశీలించారు. అనంతరం ఆ ఔట్లెట్ గోదామును సీల్ చేసి, చికెన్ శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే కేఎఫ్సీపై తదుపరి చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు ఉంటాయని ఆహార భద్రతా శాఖ స్పష్టం చేసింది.
ఈ వివాదంపై కేఎఫ్‌సీ యాజమాన్యం స్పందిస్తూ ఆరోపణలను ఖండించింది. "మా సంస్థ ఆహార భద్రత, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.