భారతదేశం, సెప్టెంబర్ 2 -- అఖిల భారత పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (AICPI-IW) ఆధారంగా ఏడాదికి రెండుసార్లు డీఏను సవరిస్తారు. జనవరి నుంచి జూన్, జూలై నుంచి డిసెంబరు కాలానికిగానూ ఈ లెక్కలు వేస్తారు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్రం డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి (2 శాతం పెంపు) పెంచింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను కూడా 60 శాతానికి సవరించింది.

ప్రస్తుతం జూలై 2026 నుంచి వర్తించే రెండో విడత పెంపుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ డీఏ 3 శాతం పెరిగితే, అది 60 శాతం నుంచి 63 శాతానికి చేరుకుంటుంది. అయితే, కేంద్ర క్యాబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు దీనిపై పూర్తి స్పష్టత రాదు.

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబరు 3న జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ తాత్కాలిక సంఘం ...