కృష్ణా ఫేజ్-2 పైప్లైన్ మరమ్మతులు పూర్తి.. ఐదు గంటల్లోనే నీటి సరఫరా పునరుద్ధరణ
భారతదేశం, అక్టోబర్ 20 -- హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ ప్రమాదవశాత్తు ధ్వంసం కావడంతో ఏర్పడిన భారీ నీటి లీకేజీని జలమండలి అధికారులు అత్యంత వేగంగా అరికట్టారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం ఐదు గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.
ఈ ఉదయం 4 గంటల సమయంలో ఉప్పల్ బాగాయత్ సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రధాన రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో కృష్ణా ఫేజ్-2 పైప్లైన్కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ కంచెతో పాటు ఎయిర్ వాల్వ్ కూడా పూర్తిగా దెబ్బతినడంతో భారీగా నీటి లీకేజీ ఏర్పడింది. ఈ ఘటనలో హయత్నగర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.