భారతదేశం, నవంబర్ 11 -- కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ రక్షిత నీటి హక్కులను పరిరక్షించేందుకు, రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో అత్యంత సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న అన్ని రకాల జల వివాదాలపై పక్కా ఆధారాలు.. స్పష్టమైన గణాంకాలను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించాలని సూచించారు.

ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై కీలక విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు న్యాయ నిపుణులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాద...