భారతదేశం, జూలై 13 -- రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో కృష్ణా డెల్టా పరిధిలోని సాగు నీటి కష్టాలపై ఆందోళన నెలకొంది. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయినిగా మారింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ద్వారా పంటలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

జూలై 1వ తేదీన పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసినప్పటికీ ఆ ప్రవాహం సాగు అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. ఈ నేపథ్యంలో పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టాలు పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు పంపింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించారు.

పట్టిసీమ ప్రాజెక్టులో మొత్తం 24 పంపులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గరిష్టంగా 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు. ప్రస్త...