భారతదేశం, నవంబర్ 27 -- ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ నగరంలో రిటైల్ విస్తరణకు సిద్ధమైంది. కూకట్‌పల్లిలోని లేక్ షోర్ మాల్‌లో 11,890 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. ప్రాప్‌స్టాక్ సేకరించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లీజు గడువు పదేళ్ల తొమ్మిది నెలలు.

నవంబరు 26న విడుదల చేసిన ప్రకటనలో డిసెంబరు 10న స్టోర్ ప్రారంభిస్తామని యాపిల్ వెల్లడించింది. ఈ స్టోర్‌తో దేశంలో యాపిల్ రిటైల్ స్టోర్ల సంఖ్య ఏడుకు చేరుతుంది. నగరంలో ఇప్పటికే యాపిల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) బృందాలతో పాటు రిటైల్ కస్టమర్ కేర్ బృందాలు పనిచేస్తున్నాయి.

మాల్ లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న ఈ స్థలాన్ని కూకట్‌పల్లి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యాపిల్ లీజుకు తీసుకుంది. రిజిస్ట్రేషన్ పత్రాల వివరాల ప్రకారం, నెలవార...