భారతదేశం, సెప్టెంబర్ 5 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాల సైన్యాధ్యక్షుడైన అంగారకుడు (కుజుడు) మరియు మనస్సుకి కారకుడైన చంద్రుడి జంట అత్యంత శుభప్రదమైనదిగా నిపుణులు భావిస్తారు. ప్రస్తుతం బుధుడి స్వక్షేత్రమైన మిథునరాశిలో కుజుడు కొలువై ఉన్నాడు. ఇదే క్రమంలో, సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 10:17 గంటలకు చంద్రుడు కూడా మిథునరాశిలోకి ప్రవేశించాడు.

మిథునరాశిలో చంద్రుడి ఈ సంచారం సెప్టెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇలా ఒకే రాశిలో అంగారకుడు, చంద్రుడు కలవడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన 'మహాలక్ష్మి రాజయోగం' రూపుదిద్దుకుంది.

ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా రాబోయే 2 రోజుల పాటు కొందరికి అపారమైన ఆర్థిక లాభాలు, వ్యాపారంలో అద్భుత పురోగతి లభించనుంది. ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వి...