భారతదేశం, అక్టోబర్ 21 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం, అక్టోబర్ 21న తెల్లవారుజామున 4 గంటలకు చంద్రుడు శనిదేవుడి స్వక్షేత్రమైన కుంభరాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 23 వరకు చంద్రుడు ఇదే రాశిలో పయనిస్తాడు. వేద జ్యోతిష్యాల ప్రకారం మనస్సుకు, భావోద్వేగాలకు చంద్రుడు కారకుడు కాగా, క్రమశిక్షణకు, మనం చేసే కర్మలకు శనిదేవుడు అధిపతి.

అయితే.. కుంభరాశిలో ఇప్పటికే మాయా గ్రహమైన రాహువు ఉన్నాడు. చంద్రుడి రాకతో ఇప్పుడు కుంభరాశిలో రాహు-చంద్రుల సంయోగం ఏర్పడింది. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ కలయిక వ్యక్తి ఆలోచనా సరళి, ప్రవర్తన, వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా రాహువు పేరు వినగానే ప్రతికూల ఫలితాలు, అశుభాలు జరుగుతాయని అంతా భావిస్తుంటారు.

కానీ...