భారతదేశం, ఆగస్టు 21 -- క్యాన్సర్ చికిత్సారంగంలో భారతదేశం అద్భుత ఘనత సాధించింది. సాధారణంగా వాడే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్‌కు గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పనిచేసే 'స్మార్ట్' క్యాన్సర్ ఔషధాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

'ఆర్కే-251' (RK-251) గా నామకరణం చేసిన ఈ ఔషధం, శరీరంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ కణజాలాలలో నిద్రాణంగా (Inactive) ఉంటూ, క్యాన్సర్ ఉన్న చోటికి చేరుకోగానే ఉత్తేజితమవుతుంది (Switched on).

ఈ విప్లవాత్మక ఔషధాన్ని గువాహటిలోని [ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST)] శాస్త్రవేత్త డాక్టర్ ఆసిస్ బాలా, ఐఐటీ గువాహటి (IIT Guwahati) నిపుణుడు డాక్...