భారతదేశం, జూలై 20 -- నూతన కారు కొనుగోలు చేయాలనుకునే వారికి దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తీపి కబురు చెప్పింది. జులై 2026 నెలకు గాను తన వాహనాల శ్రేణిపై రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. సొనెట్, సైరోస్, సెల్టోస్, క్యారెన్స్ క్లావిస్, క్యారెన్స్ క్లావిస్ ఈవీ, కార్నివాల్ మోడళ్లపై కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది.

ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు 2026 జులై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మోడల్, వేరియంట్, ప్రాంతాన్ని బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నందున, పూర్తి వివరాల కోసం సమీప కియా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కేటగిరీకి చెందిన కియా సొనెట్‌పై కంపెనీ రూ. 20,000 ఎక్స్చేంజ్ బ...