భారతదేశం, మార్చి 30 -- రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్​ పాటిల్ కామెంట్స్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని బీఆర్ఎస్​ సభ్యుడు సురేశ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సురేష్‌ రెడ్డి సమాధానం ఇస్తూ.. కేంద్ర జల్‌శక్తి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

'కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం. రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి అనుమతుల కోసం కేంద్రం దగ్గరికి వచ్చారు. ప్రాజెక్టు లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు.' అని సీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు మీద ఎన్​ఎస్​డీఏ నివేదికను ...