భారతదేశం, మే 13 -- తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మెుదలైంది. అయితే యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ కచ్చితంగా ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఇంటర్ బోర్డు మరో ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వం రెండు నిబంధనలను చాలా సీరియస్‌గా అమలు చేస్తోందని, ఆధార్ కార్డు, యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు పేర్కొందని వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మేం మత్తు పదార్థాలను వినియోగించబోం, విక్రయించబోం అని రాసి ఉన్న అఫిడవిట్‌పై సంతకం చేసి కళాశాలకు సమర్పించాల్సి ఉం...