కార్తీక సోమవారం.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అభిషేకాలు, స్పర్శ దర్శనాల రద్దు
భారతదేశం, నవంబర్ 23 -- కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శ్రీశైలం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.
వేకువజామునే శ్రీశైలం చేరుకున్న భక్తులు పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించి, కృష్ణమ్మ ఒడ్డున కార్తీక దీపాలను వదిలి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధుల్లో భక్తులు దీపారాధనలు నిర్వహించారు. వేలాది దీపాల వెలుగుల్లో మల్లన్న క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.