భారతదేశం, అక్టోబర్ 25 -- కార్తీక మాస మహోత్సవాలు, శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజల కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఏలూరు జిల్లా నుంచి శబరిమలతో పాటు ప్రసిద్ధ పంచారామ క్షేత్ర దర్శనాల కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఎస్.కె. షబ్నం వెల్లడించారు.

భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సునాయాసంగా తమ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునేలా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రోజుల వ్యవధిని బట్టి మూడు రకాల ప్యాకేజీలను ఆర్టీసీ నిర్ణయించింది.

4 రోజుల శబరిమల ప్యాకేజీ: రూ. 5,200

6 రోజుల శబరిమల ప్యాకేజీ: రూ. 6,000

10 రోజుల శబరిమల ...