భారతదేశం, నవంబర్ 15 -- పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు, టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణంతో పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పంచారామ క్షేత్రాలైన అమరావతి (అమరారామం), భీమవరం (సోమారామం), పాలకొల్లు (క్షీరారామం), ద్రాక్షారామం (భీమేశ్వర స్వామి), సామర్లకోట (కుమారభీమేశ్వర స్వామి) ఆలయాలను దర్శించుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

ఏలూరు జిల్లా (ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోలు) నుంచి నవంబర్ 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబర్ 6వ తేదీ రా...