భారతదేశం, నవంబర్ 6 -- కార్తీక మాసంలో అరుణాచల క్షేత్ర దర్శనానికి వెళ్లే శివ భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే కార్తీక మహాదీపం ఉత్సవాలు-2026 సందర్భంగా భక్తుల రాకపోకల సౌకర్యార్థం కాకినాడ, రాజోలు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఏడాది అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు నవంబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన పౌర్ణమి మహోత్సవం, గిరిప్రదక్షిణ సమయాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు రాజోలు, కాకినాడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. రాజోలు డిపో మ...